: ధోనీ పాత్రలో నటిస్తానని ఊహించలేదు: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ‘ఎమ్.ఎస్ ధోనీ-ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంలో బాలీవుడ్ యంగ్ స్టార్ సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ నటిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో ధోనీ పాత్రలో సుశాంత్ నటిస్తున్నాడు. అయితే సుశాంత్‌కి ధోనీ ఎప్పటినుంచో తెలుసట. సుశాంత్ తన బావ, వారి ఇద్దరి పిల్లలు, ధోనీ, ఊతప్పను కలిపి.. తాను చిన్నప్పుడు తీసిన ఓ ఫోటోను తాజాగా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ‘ఎమ్.ఎస్ ధోనీ-ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంలో నటిస్తున్న తాను ధోనీ పాత్రలో నటిస్తానని ఇంతకుముందు ఊహించలేదని ట్వీట్ చేశాడు.