: మంగళ వాయిద్యాల నడుమ తెలంగాణ భాజ‌పా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్‌


రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేయడ‌మే లక్ష్యంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ ను తెలంగాణ రాష్ట్ర భాజపా నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ పార్టీ అధిష్ఠానం ఇటీవ‌లే నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. అధ్య‌క్షుడిగా కొద్ది సేప‌టి క్రితం ఆయన బాధ్య‌త‌లు స్వీకరించారు. హైద‌రాబాద్‌లోని భాజ‌పా కార్యాలయంలో మంగళ వాయిద్యాల నడుమ ఈ కార్య‌క్రమం జ‌రిగింది. ఈ సందర్భంగా ల‌క్ష్మ‌ణ్‌ను కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తో పాటు ప‌లువురు భాజ‌పా నేత‌లు అభినందించారు.

  • Loading...

More Telugu News