: వైకాపాను హెల్ప్ అడుగుతున్న కాంగ్రెస్... స్వయంగా రంగంలోకి దిగిన ఉత్తమ్, భట్టి


తమ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించడంతో ఖాళీ అయిన పాలేరు ఉప ఎన్నికలో ఎన్నికలు జరగనున్న వేళ, ఎలాగైనా తిరిగి నియోజకవర్గాన్ని దక్కించుకోవాలన్న ఆలోచనతో, కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. పాలేరులో వైకాపా క్రియాశీలకంగా ఉండటంతో, తాము నిలబెట్టిన అభ్యర్థికి మద్దతివ్వాలని కాంగ్రెస్ కోరుతోంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు నియోజకవర్గంలోని నేతలందరినీ కలిసి విజ్ఞప్తులు చేస్తున్నారు. టీఆర్ఎస్ కుటిల రాజకీయాన్ని తరిమికొట్టాలంటే, కాంగ్రెస్ కు మద్దతివ్వాలని వారు కోరుతున్నారు. మరోవైపు తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ మద్దతు కోరుతోంది. మరే పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించకుంటే, పాలేరును కైవసం చేసుకుని తెరాసకు గుణపాఠం చెప్పవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా, టీఆర్ఎస్ పార్టీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ప్రకటించిన సంగతి తెలిసిందే. దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితను ఇక్కడ రంగంలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News