: చిరంజీవి మెగాస్టార్, వెంకటేష్ ఏ స్టారో నాకు తెలియదు: కేసీఆర్


ఈ ఉదయం బాలకృష్ణ 100వ చిత్రం ప్రారంభోత్సవానికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ, వేదికపై నవ్వులు పూయించారు. తన ప్రసంగం చివర, ప్రతిఒక్కరూ బాలకృష్ణను అభినందించాలని చెబుతూ... "చిరంజీవి మెగాస్టార్ గారు... వెంకటేష్ మరి ఏం స్టారో నాకు తెల్వదు" అనగానే వేదిక కిందవున్న అభిమానులు నవ్వుతూ కేరింతలు కొట్టారు. పక్కనే ఉన్న బాలకృష్ణ, కేసీఆర్ కు సమాధానం ఇవ్వగా, "విక్టరీయా... ఆ విక్టరీ వెంకటేష్ గారు, శంకర్ గారు వచ్చారు. దాసరి గారు సరేసరి ఉన్నరు. రాఘవేంధ్రరావు... మహామహులు ఉన్నరు. ఇంతమంది దీవెనలతో... సింగీతం శ్రీనివాసరావు గారు పెద్దలు... ఎన్టీఆర్ గారితోనే అనేక చిత్రాలు నిర్మించినటువంటి దర్శకులు... నన్ను కూడా ఆశీర్వదించారు. ఈ ముహూర్తం.. గొప్పగా సినిమా అనుకున్నంత వేగంగా నిర్మితమై తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయే చారిత్రక సినిమాగా నిలుస్తుందని మరొక్కసారి తెలియజేస్తున్నాను" అని అన్నారు.

  • Loading...

More Telugu News