: స్కూల్లో అబ్బాయి కోసం బాలికల గొడవ.. 16 ఏళ్ల విద్యార్థినిని కొట్టి చంపిన వైనం
ఓ అబ్బాయి కోసం ఇద్దరు పాఠశాల విద్యార్థినుల మధ్య జరిగిన ఘర్షణ 16 ఏళ్ల బాలిక మరణానికి దారితీసింది. అమెరికాలోని డెలావేర్ విల్మింగ్టన్‌లోని ఓ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ అబ్బాయి కోసం ఇద్దరు బాలికల మధ్య తీవ్ర ఘర్షణ కొనసాగుతోన్న నేపథ్యంలో నిన్న వాష్‌రూంలో ఆ ఇరువురు బాలికలు పరస్పరం కొట్టుకున్నారు. ఇంతలో ఇద్దరు బాలికల్లో ఒక బాలిక స్నేహితురాళ్లు అక్కడకు చేరుకుని ప్రత్యర్థి బాలికను చావబాదారు. దీంతో సదరు 16ఏళ్ల బాలిక కుప్పకూలిపోయింది. అనంతరం విషయాన్ని గమనించిన స్కూల్ సిబ్బంది ఆ బాలికను ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. బాలిక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై స్కూల్ యాజమాన్యం బాలిక తల్లిదండ్రులకు తమ సానుభూతి తెలిపింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.