: ఢంకా మోగించండి, వెంకటమ్మపుత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారూ!: దాసరి
"యస్ రెడీ... సైలెన్స్ ప్లీజ్... కరెక్టేనా టైమ్... రెడీ... గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర ప్రారంభోత్సవ శుభవేళ, చిత్ర మొదటి దృశ్యం ఢంకా మ్రోగించండి... అని వెంకటమ్మ పుత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావుగారు... రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఢంకా మ్రోగించండి... ప్రారంభం" అని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అనగానే, దేవుళ్ల విగ్రహాలపై తీసిన ముహూర్తపు షాట్ కు కేసీఆర్ క్లాప్ కొట్టారు. ఆ వెంటనే చిరంజీవి కెమెరా స్విచ్చాన్ చేసి 'రోలింగ్' అనగా బాలయ్య డైలాగ్ చెప్పారు. వెంకటేష్ కెమెరాను ఆపరేట్ చేయగా, రాఘవేంధ్రరావు 'కట్, ఓకే' చెప్పడంతో ముహూర్తపు షాట్ షూటింగ్ లాంఛనంగా పూర్తయింది. ఆపై దాసరి 'శుభం' పలికారు.