: ‘ఖజానా’లో లెక్కాపత్రం లేదట!... ఐటీ దాడుల్లో వెలుగుచూసిన భారీ అక్రమాలు


ఆభరణాల తయారీలో దేశీయ రీటెయిల్ దిగ్గజం ‘ఖజానా జ్యువెల్లర్స్’ భారీ అక్రమాలకు పాల్పడింది. పన్ను పోటు నుంచి తప్పించుకునేందుకు ఆ సంస్థ టర్నోవర్ ను తక్కువగా చూపిస్తోంది. లెక్కల్లో చూపిస్తున్న బంగారం నిల్వలకు.. అమ్మకాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇక పలు బ్యాంకుల్లో ఆ సంస్థ పేరిట ఉన్న లాకర్లలో లెక్కల్లో చూపని బంగారం నిల్వలు కూడా పెద్ద మొత్తంలో బయటపడ్డాయి. ఈ మేరకు నిన్న ఉదయం 8 గంటల సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ‘ఖజానా’ షాపుల్లో ఆదాయపన్ను శాఖ ఏకకాలంలో మెరుపు దాడి చేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని ఆ సంస్థ షాపుల్లో నిన్న రాత్రి పొద్దుపోయేదాకా సోదాలు కొనసాగాయి. కొన్ని ప్రాంతాల్లో నేడు కూడా ఆ సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేసే అవకాశాలు లేకపోలేదని సమాచారం. పెద్ద మొత్తంలో అక్రమాలు బయటపడటంతో ‘ఖజానా’పై భారీ జరిమానా విధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News