: వేడుకగా సుజనా కుమారుడి పెళ్లి... హాజరైన చంద్రబాబు, వెంకయ్య, తుమ్మల, ఎర్రబెల్లి


టీడీపీ సీనియర్ నేత, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి కుమారుడు కార్తీక్ పెళ్లి నేహాతో నిన్న ఘనంగా జరిగింది. హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లికి రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీసమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. బీజేపీ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆ పార్టీ మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే... మొన్నటిదాకా టీడీపీలో ఉండి, ఇటీవలే టీఆర్ఎస్ లోకి జంప్ అయిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇంకా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆ పార్టీ రెండు రాష్ట్రాల అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎల్.రమణ, టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి తదితరులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News