: పాలేరు బిగ్ ఫైట్ కు నోటిఫికేషన్ నేడే!
ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు జారీ కానుంది. తెలంగాణ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో పాలేరుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఈ ఉప ఎన్నికకు షెడ్యూల్ ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం... నేడు నోటిఫికేషన్ ను జారీ చేయనుంది. టీఆర్ఎస్ తన అభ్యర్థిగా ఆర్ అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరును ప్రకటించగా, సీపీఎం కూడా తన అభ్యర్థిని ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డిని రంగంలోకి దించనున్నట్లు సమాచారం.