: తస్కరణకు గురైన భారత పురాతన వస్తువులతో సోనియా చెల్లెలు వ్యాపారం: సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెల్లెలిపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. మనదేశంలో తస్కరణకు గురైన పురాతన వస్తువులతో ఇటలీ దేశంలో ఉన్న సోనియా గాంధీ చెల్లెలు వ్యాపారం చేస్తున్నారని, ఒక షాపు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.