: నాకు హైదరాబాద్ చాలా నచ్చింది... సొంతిల్లు కూడా కొన్నాను: రకుల్ ప్రీత్ సింగ్


‘నాకు హైదరాబాద్ చాలా నచ్చింది. మూడేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను’ అని అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. హైదరాబాద్ లో సొంతిల్లు కొన్నానని, కాకపోతే ఆ ఇంట్లోకి ఇంకా షిఫ్ట్ కాలేదని పేర్కొంది. హోటళ్లలో ఉండి తనకు విసుగుపుట్టిపోయిందని చెప్పింది. షూటింగ్ అయిపోయిన తర్వాత హోటల్ కు వెళ్లాలంటే చాలా బోరుగా ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా, హోటల్ ఫుడ్ తినీతినీ విసుగు వచ్చేసిందని, తనకు హోమ్ మేడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని, అది కూడా... వెరైటీలుంటే మరీ ఇష్టమని రకుల్ తెలిపింది.

  • Loading...

More Telugu News