: బాలికలకు రక్షణ కావాలంటే ఇలా చేయండి: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
బీహార్ చంపారన్ జిల్లాలోని బగహాలో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మతాలకు అతీతంగా ఇద్దరు సంతానం నిబంధనను వర్తింపచేయాలని అన్నారు. అంతేకాదు, దేశంలో ఇద్దరు పిల్లల నిబంధనను అమలు చేయకపోతే హిందూ బాలికల రక్షణ కష్టమౌతుందని పేర్కొన్నారు. పాకిస్థాన్‌లోలా మన దేశంలో ఆడపిల్లలను పరదాల వెనుక ఉంచే పరిస్థితి రాకుండా ఉండాలంటే జనాభా తగ్గాల్సిందేనని, అప్పుడే వారికి సెక్యూరిటీ ఉంటుందని అన్నారు.