: ఉక్రెయిన్, రష్యా మధ్య పెరిగిన విభేదాలు... రష్యా సినిమాలపై నిషేధం
ఉక్రెయిన్, రష్యా మధ్య విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. ఉక్రెయిన్ అధీనంలో ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించుకోవడంతో ఈ విభేదాలు మరింత పెరిగిపోయాయి. దీంతో రష్యాతో ఉన్న అన్ని బంధాలు తెంచుకునేందుకు ఉక్రెయిన్ సిద్ధమైంది. ఈ నేఫథ్యంలో రష్యాకు సంబంధించిన సినిమాలపై నిషేదం విధించింది. 2014 నుంచి రష్యా కంపెనీలు, రష్యా వ్యక్తులు నిర్మించిన సినిమాలేవీ ఉక్రెయిన్ లో విడుదల చేయకూడదంటూ నిషేధం విధించిన బిల్లుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు పొరషెంకో సంతకం చేశారు. అలాగే 1991 నుంచి రష్యాలో నిర్మించిన సినిమాలపై కూడా ఈ నిషేధం వర్తిస్తుందని ఆ బిల్లులో పేర్కొన్నారు. తమకు చెందిన ద్వీపకల్పాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా, తమ దేశంలో తిరుగుబాటుదారులకు మద్దతిస్తూ శాంతి భద్రతల సమస్యకు కారణమవుతోందని ఆరోపిస్తూ ఉక్రెయిన్ ఈ నిర్ణయం తీసుకుంది.