: కోర్టులతో ఎందుకు ఆడుకుంటున్నారు..?: కేంద్రానికి ఉత్త‌రాఖండ్ హైకోర్ట్ సూటి ప్ర‌శ్న‌


కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్వాసన ప‌లుకుతూ ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై నిన్న‌ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన ఆ రాష్ట్ర హైకోర్టు.. కేంద్రం తీరుపై ఈరోజు మ‌రోసారి మండిపడింది. రాష్ట్రపతి కూడా ఒక్కోసారి పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నిన్న హైకోర్టు వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈరోజు తాజాగా కేంద్రం తీరుపై విరుచుకుప‌డుతూ కోర్టులతో ఎందుకు ఆడుకుంటున్నారని సూటిగా ప్ర‌శ్నించింది. కోర్టు నుంచి ఆదేశాలు అందుకున్న వెంట‌నే ఉత్త‌రాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను ఎందుకు ఉప‌సంహ‌రించుకోలేద‌ని ప్ర‌శ్నించింది. కేంద్రం తీరుతో తమకు ఆగ్ర‌హం కంటే బాధే ఎక్కువ‌గా కలుగుతోందని చెప్పింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించిన కేంద్రం తీరు న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడం కాదా..? అని ప్ర‌శ్నించింది. తాము తీర్పు ఇచ్చే వరకూ రాష్ట్రపతి పాలన ఎత్తివేయొద్దని కేంద్రానికి తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఈ విష‌య‌మై న్యాయ‌స్థానానికి మ‌రింత ఆగ్ర‌హం తెప్పించ‌కుండా కేంద్రం న‌డుచుకుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేసింది.

  • Loading...

More Telugu News