: మలయాళ నటుడు సురేష్ గోపీకి అరుదైన గౌరవం!... రాజ్యసభకు నామినేట్ చేసిన కేంద్రం
చలన చిత్రాల్లో పోలీస్ పాత్రల్లో ఒదిగిపోయిన మలయాళ నటుడు సురేష్ గోపీకి అరుదైన గౌరవం లభించింది. లెక్కకు మిక్కిలి చిత్రాల్లో పోలీసు పాత్రల్లో ప్రేక్షకులను రంజింపజేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సురేష్ గోపీని రాజ్యసభకు నామినేట్ చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం సురేష్ గోపీ పేరుతో పాటు మరికొందరి పేర్లను పెద్దల సభకు నామిమేట్ చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి జాబితాను పంపింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే సురేష్ గోపీ రాజ్యసభ సభ్యుడిగా కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.