: రెండుగా చీలనున్న వైకాపా... జగన్ హస్తాల నుంచి త్వరలోనే బయటకు: యనమల


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి త్వరలో రెండుగా చీలిపోనుందని, అత్యధికులు బయటకు వచ్చి, పార్టీ పేరును అధికారికంగా మార్చనున్నారని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైకాపాపై జగన్ తన అధీనాన్ని కోల్పోనున్నాడని, ఇది కార్యరూపం దాల్చే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన అన్నారు. జగన్ కు ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10.9 శాతం వృద్ధితో దేశంలోనే ముందు నిలిచిందని తెలిపారు. అభివృద్ధిని చూసి, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న సదుద్దేశంతోనే వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కిందకు వస్తున్నారని తెలియజేశారు.

  • Loading...

More Telugu News