: బెంగాల్ లో మూడో దశ పోలింగ్... 62 స్థానాలకు ఓటింగ్ ప్రారంభం


పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల క్రతువు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు దశల్లో పలు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా... తాజాగా మూడో దశ పోలింగ్ ఆ రాష్ట్రంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం దాకా కొనసాగనుంది. మూడో దశ పోలింగ్ లో 62 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మూడో దశ పోలింగ్ జరుగుతున్న పలు నియోజకవర్గాలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News