: లిబియాలో ఘోరం...500 మంది జలసమాధి
లిబియాలో దారుణం చోటుచేసుకుంది. ఉగ్రవాద చర్యలు పెరిగిపోవడంతో ప్రాణాలరచేతిలో పెట్టుకుని దేశాలు దాటిపోదామని భావించిన అభాగ్యులను సాగరమాత కరుణించలేదు. ఈజిప్టు నుంచి లిబియా సముద్రం గుండా దేశాలు దాటిపోదామని భావించిన శరణార్థుల బోటు లిబియా సముద్రతీరంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో శరణార్థులు జలసమాధి అయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ తెలిపింది. ఈ బోటులో ప్రయాణించిన 37 మంది పురుషులు, ముగ్గురు మహిళలు, మూడేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డారు. వీరు తెలిపిన వివరాల ప్రకారం 500 మంది జలసమాధి అయినట్టు తెలుస్తోంది.