: జగన్ దృష్టిలో ప్రత్యేక ప్యాకేజీ అంటే...: టీడీపీ నేత ఆనం
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ప్రత్యేక ప్యాకేజీ అంటే అవినీతి సంపాదనేనని, అదే ఆయనకు గుర్తుకు వస్తుందని టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లో విద్యార్థి మాత్రమే అయిన జగన్, అవినీతి సంపాదన విషయంలో మాత్రం ప్రొఫెసర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం, చట్టం గురించి జగన్ కు ఏమాత్రం తెలియవని ఆనం విమర్శించారు.