: అభిమాన హీరో పర్సు నిజాయతీగా ఇచ్చి...బంపర్ ఆఫర్ కొట్టేసిన ఫ్యాన్


అభిమాన హీరోకు సంబంధించిన ఏదైనా వస్తువు దొరికితే దానిని ఒక స్వీట్ మెమొరీగా ఉంచుకునేందుకు ఎక్కువ మంది ప్రయత్నిస్తారు. లాస్ ఏంజిలెస్ కు చెందిన ట్రిస్టిన్ బడ్జిన్ బేకర్ మాత్రం అలా చేయకుండా, ఆదర్శంగా నిలిచాడు. దాంతో నజరానాతో పాటు అభిమాన నటుడితో కలసి టెలివిజన్ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే...'థోర్', 'ఎవేంజర్స్' సినిమాలతో విశేషమైన అభిమానులను దక్కించుకున్న క్రిస్ హేమ్ వర్త్ డిన్నర్ కోసం ఓ హోటల్ కు వెళ్లాడు. అక్కడ తన పర్సు మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆ టేబుల్ వద్ద భోజనం చేసేందుకు వెళ్లిన బేకర్ అనే వ్యక్తి ఆ పర్సును గుర్తించాడు. పర్సు తెరిచి చూసి తన అభిమాన నటుడిదని తెలుసుకున్నాడు. దీంతో సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయాడు. తరువాత నేరుగా అతని ఇంటికి వెళ్లి ఆ పర్సు ఇచ్చేశాడు. అందులో పెద్ద మొత్తం లేకపోయినప్పటికీ తన అభిమాని నిజాయతీకి మెచ్చిన క్రిస్ హేమ్ వర్త్ అతనికి భారీగా నజరానా ఇచ్చిపంపాడు. ఆ తరువాత అతనికి ధాంక్స్ చెబుతూ లేఖ రాశాడు. భవిష్యత్ లో అతను గొప్ప హోదాలో ఉండాలని ఆంకాంక్షించాడు. దీంతో విషయం వెలుగు చూసింది. అతని నిజాయతీ, స్టార్ హీరో పర్సు అని తెలిసి ఇచ్చేసినందుకుగాను ఇమేజ్ పబ్లిషర్స్ షట్టర్ ఫ్లై సంస్థ అతనికి 10,000 డాలర్లు నజరానాగా అందజేసింది. 'ద ఎలెన్ డిజైనర్స్' షోలో బేకర్ తో కలిసి క్రిస్ హేమ్ వర్త్ పాల్గొన్నాడు. దీంతో బేకర్ కు స్టార్ హోదా వచ్చింది.

  • Loading...

More Telugu News