: పాత్రికేయులపై మళ్లీ రెచ్చిపోయిన విజయ్ కాంత్.. చెంప దెబ్బ కొడతానంటూ ఊగిపోయిన కెప్టెన్!


డీఎండీకే అధినేత, తమిళ హీరో విజయ్ కాంత్ మరోసారి జర్నలిస్టులపై రెచ్చిపోయారు. సేలంలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జర్నలిస్టులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చెంపదెబ్బ కొడతానంటూ ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. విజయ్ కాంత్ ఈవిధంగా ఎందుకు ప్రవర్తించారనే విషయమై వివరాలు తెలియాల్సి ఉంది. డీఎండీకే, పీడబ్ల్యూ కూటమికి సీఎం అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆయన ఉల్లుందూర్ పేట్ నుంచి బరిలో దిగారు. కాగా, జర్నలిస్టులపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం విజయ్ కాంత్ కు ఇదేమీ తొలిసారి కాదు. అంతకుముందు కూడా జర్నలిస్టులతో ఆయన ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై కూడా ఆయన పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News