: ఈ ఏడాది సాధారణ వర్ష పాతమే: జైపాల్ రెడ్డి
రుతుపవనాల కారణంగా ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జైపాల్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన ఈరోజు భారత వాతావరణ విభాగం నివేదిక విడుదల చేశారు. దీర్ఘకాలిక సగటు రీత్యా ఈ ఏడాది వర్షపాతం 98 శాతం మాత్రమే ఉంటుందని జైపాల్ రెడ్డి చెప్పారు. అన్ని అంచనాలు వర్షపాతం సాధారణమే అని సూచిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. కాగా, తీవ్ర దుర్భిక్షంతో సతమతమవుతున్న మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకల్లోనూ వర్షపాతం మామూలుగానే ఉంటుందని జైపాల్ రెడ్డి తెలిపారు.