: బలాన్ని పెంచుకోవడానికి అందర్నీ చేర్చుకుంటున్నాం...పార్టీ కోసం పాటు పడిన వారిని మర్చిపోం: చంద్రబాబు


బలాన్ని పెంచుకునేందుకు అందరినీ పార్టీలో చేర్చుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో బొబ్బిలి వైఎస్సార్సీపీ నేతలను పార్టీలో చేర్చుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీలోకి కొత్త నీరు వస్తోందని పాతవారు ఆలోచనలో పడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉన్న వారిని మర్చిపోమని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి, ఓటమిపాలైన తెంటు లక్ష్మునాయుడు, తూముల భాస్కరరావుకు ఏ సహాయం కావాల్సి వచ్చినా పార్టీ చేస్తుందని, వారి వెన్నంటి నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News