: కరవు గ్రామాలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్
వర్షాభావం వల్ల మహారాష్ట్రలో ఏర్పడిన తీవ్ర కరవు పరిస్థితిని ఎదుర్కొనే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘జలయుక్త్ శివార్ అభియాన్’ కార్యక్రమానికి నిన్న బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ 50లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. కరవు పీడిత ప్రాంతాలను ఆదుకునేందుకు ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు ముందుకొచ్చాడు. మహారాష్ట్రలో తీవ్ర కరవు నెలకొన్న రెండు గ్రామాలను బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ దత్తత తీసుకోనున్నారు. అక్కడి తల్, కొరేగావ్ గ్రామాలను ఆయన దత్తత తీసుకోనున్నట్లు సమాచారం. మహారాష్ట్రలోని కరవు ప్రాంతాల్లో ఇటీవలే పర్యటించిన ఆమిర్ ఖాన్ తల్, కొరేగావ్ గ్రామాలను గ్రామాలను దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. కరవు పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు సీఎం ఫడణవీస్ సర్కార్ తీసుకుంటున్న చర్యలను ఆమిర్ అభినందించాడు.