: ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణానికి మండపేట కల్యాణ కొబ్బరి బొండాలు


కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో నేటి రాత్రి రాములోరి కల్యాణం కన్నుల పండువగా జరగనుంది. కోదండరాముడి కల్యాణానికి ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) భారీ ఏర్పాట్లు చేసింది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కల్యాణానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా హాజరుకానున్నారు. ఈ కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి కల్యాణ కొబ్బరి బొండాలు తరలివచ్చాయి. మండపేటకు చెందిన వరలక్ష్మీ, సత్యనారాయణ దంపతులు దాదాపు మూడు రోజులుగా శ్రమించి ఈ కల్యాణ కొబ్బరి బొండాలను అందంగా అలంకరించారు. నిన్న సాయంత్రానికే ఈ బొండాలు ఒంటిమిట్టకు చేరాయి. గతేడాది కూడా ఈ దంపతులే కోదండరాముడి కల్యాణానికి కల్యాణ కొబ్బరి బొండాలను అందజేశారు.

  • Loading...

More Telugu News