: తాగిన మైకంలోనే యువకులు ఆ షాపులను తగుల బెట్టారు: పోలీసులు
సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద ఐదు దుకాణాల్లో నిన్న అగ్నిప్రమాదం జరిగిన ఘటన తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు వచ్చి షాపులను తగులబెట్టారని బాధితుల నుంచి ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు సదరు నిందితులను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులు చిరంజీవి, విజయేంద్రవర్మలను గుర్తించిన పోలీసులు ఇరువురినీ అదుపులోకి తీసుకుని ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు చిరంజీవి కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ కుమారుడని పోలీసులు చెప్పారు. యువకులు చిరంజీవి, విజయేంద్రవర్మ తాగిన మైకంలో షాపులను తగుల బెట్టారని పోలీసులు పేర్కొన్నారు.