: కోహినూర్ ను ఎలా తెప్పించాలి? పార్లమెంట్ లో చర్చించనున్న మోదీ సర్కారు!
బ్రిటీష్ పాలనలో ఇండియా నుంచి తరలివెళ్లిపోయిన అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇండియాకు ఎలా తెప్పించాలన్న విషయమై నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు పార్లమెంటులో చర్చించనుంది. కోహినూర్ విషయంలో కోర్టులో ఓ మాట చెప్పి, ఆపై 24 గంటలు తిరక్కముందే మరో మాట చెప్పి, విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేంద్రం, నష్ట నివారణ దిశగా, ఈ అంశాన్ని పార్లమెంట్ ముందే ఉంచాలని నిర్ణయించింది. ఈ వజ్రాన్ని బ్రిటన్ బలవంతంగా తీసుకెళ్లలేదని, వారికి బహుమతిగా పంజాబ్ పాలకులు ఇచ్చారని, అందువల్ల తిరిగి ఇవ్వాలని కోరలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలుపగా, దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఆపై, సామరస్య పూర్వకంగా వజ్రాన్ని తిరిగి ఇండియాకు తీసుకురావాలన్నదే తమ అభిమతమని కేంద్ర సాంస్కృతిక శాఖ ఓ ప్రకటనలో తెలిపిన సంగతి విదితమే.