: భార్యను బలవంత పెట్టినా నేరమే: త్వరలో కొత్త చట్టం!
వివాహం చేసుకున్న భార్యను బలవంతపెట్టి లైంగిక వాంఛను తీర్చుకుంటే, దాన్ని నేరంగా పరిగణిస్తూ, విచారణ జరిపి శిక్షలు విధించేలా కొత్త చట్టం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ తెలిపారు. దేశవ్యాప్తంగా 61 అదనపు జిల్లాల్లో 'బేటీ బచావో, బేటీ పఢావో' కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించిన ఆమె, వివాహ బంధమే అయినా, బలవంతంగా అనుభవిస్తే నేరంగా భావించేలా నిర్ణయం త్వరలో వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాగా, మార్చి 10న ఇదే అంశంపై రాజ్యసభలో ఓ సభ్యుడు ప్రశ్నించగా, భారత చట్టాల్లో 'వివాహ అత్యాచారం' లేదని, అది విదేశాల్లో మాత్రమే అమలవుతోందని, ఇండియాలో అమలు చేయడం క్లిష్టమని సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాలో మత నమ్మకాలు, ప్రజల మైండ్ సెట్, పేదరికం తదితర కారణాలు ఈ తరహా చట్టానికి ప్రతిబంధకాలని ఆనాడు మేనకా గాంధీ అభిప్రాయపడ్డారు. ఆమె వ్యాఖ్యలపై మహిళాలోకం భగ్గుమనగా, తాజాగా వివాహ అత్యాచారంపై ఇలా స్పందించారు.