: ఢిల్లీలో మరో 10-15 ఏళ్లు అధికారం తమదేనట... కేజ్రీవాల్ ప్రకటన!
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిన్న ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఢిల్లీలో మరో 10 నుంచి 15 ఏళ్ల పాటు అధికారం తమదేనని ఆయన వ్యాఖ్యానించారు. సివిల్ సర్వీసెస్ డేను పురస్కరించుకుని అఖిల భారత సర్వీసు అధికారులతో నిన్న సమావేశమైన సందర్భంగా ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ఆయన కారణం కూడా చెప్పారు. తమ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఢిల్లీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్న కేజ్రీవాల్... మరో రెండు, మూడు ఎన్నికల్లో తమ పార్టీనే విజయం వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎవరేమన్నా... 45 ఏళ్ల వయసు నిండిన ఢిల్లీ వాసుల అభిప్రాయం ఇదేనని కూడా ఆయన పేర్కొన్నారు.