: బర్త్ డే నాడు భార్యతో కలిసి కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు


తన జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కనకదుర్గమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. నేటి ఉదయం తన సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన అక్కడి నుంచి నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, పార్టీ నేతలు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News