: జెట్ ఎయిర్ వేస్ విమానానికి బాంబు బెదిరింపు... అహ్మదాబాదులో ఎమర్జెన్సీ ల్యాండింగ్


గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాదులో కొద్దిసేపటి క్రితం కలకలం చోటుచేసుకుంది. జెట్ ఎయిర్ వేస్ కు చెందిన ఓ విమానానికి బాంబు బెదిరింపులు ఎదురయ్యాయి. నిండా ప్రయాణికులతో ఆకాశయానం ప్రారంభించిన సదరు విమానం వినువీధిలో ఉండగానే ఈ బెదిరింపులు ఎదురయ్యాయి. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారుల సూచన మేరకు సదరు విమానాన్ని దాని పైలట్ అహ్మదాబాదులోని ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఆ తర్వాత హుటాహుటిన అక్కడకు చేరుకున్న బాంబు స్క్వాడ్ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో అక్కడ కలకలం రేగింది.

  • Loading...

More Telugu News