: నెల్లూరులో వైసీపీకి ఎదురు దెబ్బ!... టీడీపీలో చేరనున్న పారిశ్రామికవేత్త వేమిరెడ్డి


ఏపీలో విపక్షం వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. తాజాగా నేడు మరో ఎమ్మెల్యే సైకిలెక్కనున్నారు. ఈ క్రమంలో పార్టీకి అండగా ఉంటున్న పారిశ్రామికవేత్తల వలసలు కూడా ప్రారంభమయ్యాయనే చెప్పాలి. నెల్లూరు జిల్లాలో పార్టీకి అండగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి (వీపీఆర్) నిన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. విజయవాడలో జరిగిన ఈ భేటీ తర్వాత వేమిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే గతంలో ఓ మారు పార్టీ మారేందుకు వేమిరెడ్డి యత్నించగా... పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నచ్చజెప్పడంతో వెనక్కు తగ్గారు. ఇక భవిష్యత్తులో వేమిరెడ్ది పార్టీని వీడరన్న ధీమాతో జగన్ ఉన్నారు. అయితే అందరికీ షాకిస్తూ నిన్న వేమిరెడ్డి విజయవాడలో లోకేశ్ తో భేటీ అయ్యారు. గడచిన ఎన్నికల సందర్భంగా జిల్లా ఎన్నికల సమన్వయకర్తగా వ్యవహరించిన వేమిరెడ్డి... నాడు కీలకంగా వ్యవహరించారు. తాజాగా ఆయన పార్టీ వీడనుండటంతో నెల్లూరు జిల్లాలో వైసీపీకి కీలక నేత దూరమైనట్లే.

  • Loading...

More Telugu News