: టీడీపీలోకి బొబ్బిలి రాజుల చేరిక నేడే!... చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కనున్న సుజయ!


ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి నేడు బొబ్బిలి రాజులు గుడ్ బై కొట్టనున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. బుధవారం సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో హోటల్‌ మురళీ ఫార్చూన్‌లో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. విజయనగరం నుంచి ఆయనతో పాటు శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఇన్‌చార్జ్‌, సుజయకృష్ణ సోదరుడు ఆర్‌.వి.ఎస్.కె.రంగారావు కూడా టీడీపీలో చేరుతున్నారు. బొబ్బిలి నియోజకవర్గం నుంచి సుమారు 60 మంది సర్పంచ్‌లు, 30 మంది ఎంపీటీసీలు, ఇద్దరు మండలాధ్యక్షులు, ముగ్గురు జెడ్పీటీసీలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు. కేవలం బొబ్బిలి నియోజకవర్గంలోని అనుచరులే కాకుండా జిల్లావ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ఉన్న సుమారు 2,500 మంది అనుయాయులు చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కుతారు. వీరిని విజయవాడకు తరలించడం కోసం ఇప్పటికే బొబ్బిలి నుంచి 27 బస్సులు, పార్వతీపురం నుంచి 15 బస్సులు సిద్ధం చేశారు. వందకుపైగా కార్లను అందుబాటులో ఉంచారు.

  • Loading...

More Telugu News