: నేడు చంద్రబాబు బర్త్ డే... బెజవాడలోనే నిరాడంబరంగా జన్మదిన వేడుకలు!


టీడీపీ అధినేత, నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు 67వ పడిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సందర్భంగా తొలిసారిగా బెజవాడలో బర్త్ డే వేడుకలు జరుపుకోనున్న చంద్రబాబు... హంగూ ఆర్బాటాలు లేకుండా నిరాడంబరంగా తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు... సీఎం హోదాలో 11వ సారి తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో 9 సార్లు బర్త్ డే వేడుకలు జరుపుకున్న చంద్రబాబు... రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నవ్యాంధ్ర సీఎంగా రెండోసారి తన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. నేడు తన జన్మదినం సందర్భంగా ఉదయం 10 గంటలకు తన కార్యాలయానికి రానున్న చంద్రబాబు కొంతసేపు అధికారిక విధులు నిర్వహించి ఆ తర్వాత రొటీన్ కార్యకలాపాల్లోకి అడుగుపెడతారు. పార్టీలోకి చేరికలు, ఆ తర్వాత కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో జరగనున్న రాములోరి కల్యాణానికి హాజరవుతారు.

  • Loading...

More Telugu News