: పంజాబ్ జట్టులో ఇద్దరే రాణించారు...కోల్ కతా విజయ లక్ష్యం 139


ఐపీఎల్ సీజన్ 9 లో భాగంగా మొహాలీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పేలవమైన ఆటతీరు ప్రదర్శించింది. టాస్ ఓడిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పంజాబ్ బ్యాట్స్ మన్ ఆ స్థానానికి తగ్గ ఆటతీరునే ప్రదర్శించారు. స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ బ్యాటింగ్ రానివారిలా పెవిలియన్ కు క్యూ కట్టారు. పంజాబ్ బ్యాట్స్ మన్ లో ఓపెనర్ మురళీ విజయ్ (26), షాన్ మార్ష్ (56) రాణించగా, చివర్లో బౌలర్ అబాట్ (12) రెండంకెల స్కోరు సాధించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టు 138 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో మోర్కెల్, నరైన్ చెరో రెండు వికెట్లు తీసి రాణించగా, యాదవ్, పఠాన్, చావ్లా చెరో వికెట్ తీసి వారికి సహకరించారు. 139 పరుగుల విజయ లక్ష్యంతో కోల్ కతా కాసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News