: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకం మృతి


ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా చెప్పుకునే ఆస్ట్రేలియన్ షీప్ డాగ్ మ్యాగీ (30) ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని విక్టోరియా డెయిరీ నిర్వాహకుడు, దాని యజమాని అయిన బ్రియాన్ మెక్ లారెన్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని స్థానిక పత్రిక వీక్లి టైమ్స్ తో లారెన్ మాట్లాడుతూ, ఆదివారం రాత్రి మ్యాగీ చనిపోయిందని చెప్పారు. వారం క్రితం కూడా బాగానే ఉందని అన్నారు. తన చిన్న కొడుకు లియామ్ కు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడు ‘మ్యాగీ’ని తెచ్చుకున్నామని, ఇప్పుడు తన కొడుకు వయస్సు 34 సంవత్సరాలని చెప్పారు. మ్యాగీ వయస్సు కచ్చితంగా ఇంతా అని చెప్పలేనని, ఎందుకంటే, దానికి సంబంధించిన వివరాలు ఉన్న కాగితాలు పోయాయని అన్నారు. కాగా, ఆస్ట్రేలియన్ క్యాటిల్ డాగ్ బ్లూఈ 29 సంవత్సరాలు బతికి ప్రపంచంలోనే వృద్ధ శునకం రికార్డును నెలకొల్పింది. ఆ రికార్డు గిన్నిస్ బుక్ లో కూడా పదిలంగా ఉన్నట్లు బీబీసీ పేర్కొంది. ఈ శునకం 1939లో ప్రాణాలు విడిచింది.

  • Loading...

More Telugu News