: బాబు ప్రభుత్వంపై అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీని అనుసరించి 5,300 రూపాయల జీతం పెంచితే, ఏపీలో తమకు మాత్రం 2,500 రూపాయలు పెంచారని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసింది. పీఆర్సీ ప్రకారం తమకు జీతాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో ఈ పెంపుదల దేనికీ సరిపోదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం సవతి ప్రేమను చూపిస్తోందని వారు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో తమకు జీతాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు.