: కేరళ సీఎం కు స్వల్ప గాయాలు
కేరళ సీఎం ఉమెన్ చాందీకి స్వల్ప గాయాలయ్యాయి. ఈరోజు ఉదయం పెరింతల్మన్న ప్రాంతంలోని షిఫ్పా ఆడిటోరియంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో తిరిగి బయలుదేరారు. అయితే, అక్కడ ఉన్న యువకులు ఆయనతో సెల్ఫీ దిగేందుకని చెప్పి ఒక్కసారిగా ముందుకు రావడం, అదే సమయంలో వారి పక్కనున్న గ్లాసు డోర్ బద్దలవడం జరిగింది. దీంతో గాజు ముక్కలు సీఎం కాలికి గుచ్చుకున్నాయి. వెంటనే చాందీని సమీప ఆసుపత్రికి తరలించారు.