: సౌరవ్ చౌదరి కేసులో తీర్పు వెలువడింది.. 8 మందికి ఉరి శిక్ష విధించిన న్యాయస్థానం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 2014లో జరిగిన కాలేజీ విద్యార్థి సౌరవ్ చౌదరి హత్య కేసులో ఎనిమిది మందికి మరణశిక్ష విధిస్తూ బరాసత్ కోర్టు ఈ రోజు తీర్పు చెప్పింది. తీర్పు వెలువరించే సందర్భగా ఈ కేసును చాలా అరుదైనదిగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కాలేజీ క్యాంపస్‌లో అక్రమ మద్యం, మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని వ్యతిరేకించినందుకు సౌరవ్ 2014, జులై 5న దారుణంగా హత్యకు గురయ్యాడు. దుండగులు సౌరబ్ శరీరాన్ని ముక్కలుగా నరికి రైల్వే ట్రాక్‌పై పడేశారు. కేసుతో సంబంధమున్న మరో నలుగురు నిందితులకి కూడా కోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు పట్ల సౌరవ్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.