: టీడీపీలో మగాళ్లు లేరంటున్న రోజా...టెస్టింగ్ ఏజెన్సీ ఏమైనా పెట్టారా?: టీడీపీ నేత గాలి
తెలుగుదేశం పార్టీలో మగాళ్లు లేరని అంటున్న నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా టెస్టింగ్ ఏజెన్సీ ఏమైనా పెట్టారా? అని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో అందరూ సమానమేనని అన్నారు. ఎమ్మెల్యే రోజా ‘ఐరన్ లెగ్’ అని అందరికీ తెలుసని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి తమ పార్టీలోకి తీసుకున్నామంటూ ఆ పార్టీ అధినేత చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. రోజా, బాలనాగిరెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి కి ఎన్ని డబ్బులిచ్చి వైఎస్సార్సీపీలోకి తీసుకున్నారో జగన్ చెప్పాలని గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు.