: అవును, చావాలనుకున్నాను...పాటలు పాడాలని రాసిపెట్టి ఉంది బతికాను: సింగర్ కైలాష్ ఖేర్


గతంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించానని సినీ నేపథ్య గాయకుడు కైలాష్ ఖేర్ చెప్పారు. 'జేజమ్మా జేజమ్మా', 'పండగలా దిగివచ్చావు' వంటి పాటల ద్వారా తెలుగులో పాప్యులారిటీ సంపాదించుకున్న కైలాష్ ఖేర్ ఓ టీవీ ఛానెల్ లో మాట్లాడుతూ, జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకుందామని భావించానని అన్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డప్పటికీ బతికి బట్టకట్టడం దైవ నిర్ణయమని ఆయన చెప్పారు. వివిధ భాషల్లో పాటలు పాడుతూ సేవ చేయాలని రాసిపెట్టి ఉంది కాబట్టే బతికానని ఆయన గుర్తుచేసుకున్నారు. జీవితం విలువైనదని తెలుసుకునేందుకు ఏదో ఒక సంఘటన జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. శివుడిని అపారంగా విశ్వసించే కైలాష్ ఖేర్, 'బాహుబలి'లో శివుడు శివలింగం ఎత్తుకెళ్తున్న సందర్భంగా పాడిన పాట అంటే ఇష్టమని చెప్పాడు.

  • Loading...

More Telugu News