: సల్మాన్ ఖాన్ తో సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే నటిస్తా: దీపిక షరతులు


సల్మాన్ ఖాన్ తో సినిమాలో నటించే అవకాశం అంటే హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. కానీ దీపికా పదుకునే మాత్రం షరతులు పెడుతోంది. షారూఖ్, సల్మాన్ మధ్య విభేదాలు ఉన్నప్పుడు దీపికను షారూఖ్ స్కూల్ అమ్మాయిగా భావించిన సల్మాన్ తన సినిమాల్లో తీసుకునే ప్రయత్నం చేయలేదు. షారూఖ్ తో కలిసిపోయిన తరువాత 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమాలో దీపికా పదుకునేకు నటించే అవకాశం ఇవ్వగా, డేట్స్ అడ్జెస్ట్ కాని కారణంగా నటించలేదు. తరువాత 'సుల్తాన్' సినిమాలో కూడా దీపికకు అవకాశం కల్పించగా, హాలీవుడ్ సినిమాలో ఆఫర్ వరించడంతో దానిని కూడా కాదనుకుంది. తాజాగా సల్మాన్ తదుపరి సినిమాలో హీరోయిన్ గా నటించాల్సిందిగా కబీర్ ఖాన్ అవకాశం ఇవ్వగా, దీపిక పలు షరతులు విధించిందని బాలీవుడ్ చెబుతోంది. తన పాత్ర కొత్తగా ఉండి, ప్రాధాన్యత ఉన్నదైతే నటిస్తానని కబీర్ ఖాన్ కు చెప్పిందట. కబీర్ ఖాన్ కూడా సరేనన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై సల్మాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

  • Loading...

More Telugu News