: అమ్మా రోజారెడ్డి గారూ... టీడీపీలో మగాళ్లున్నారో లేదో అందరికన్నా ఎక్కువ తెలిసిన వారు మీరే!: ఎమ్మెల్యే బొండా ఉమా
తెలుగుదేశం పార్టీలో మగవాళ్లున్నారో లేదో అందరికన్నా ఎక్కువ తెలిసింది రోజా కేనంటూ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘అమ్మా రోజారెడ్డి గారు, మీరు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. పది సంవత్సరాల పాటు మాతో ఉన్నారు. ఎంతమంది మగవాళ్లతో ఉన్నారో మీకు తెలుసు. ఎంతమంది మగవాళ్లను చూశారో మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీలో మగవాళ్లున్నారో లేదో అందరికన్నా ఎక్కువ తెలిసిన వారు మీరే రోజారెడ్డిగారు’ అని ఉమ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని కూలగొడతానన్న వైఎస్సార్సీపీ అధినేత జగనే కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు.