: మోగిన 'పాలేరు' ఎన్నికల నగారా


కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో ఖాళీ అయిన ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ సెగ్మెంటుకు వచ్చే నెల 16న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎన్నిక కోసం 22న నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని, నామానేషన్ల స్వీకరణకు తుది గడువు 29 అని తెలిపారు. 30న నామినేషన్ల పరిశీలన, మే 2 వరకూ ఉపసంహరణ గడువు ఇస్తామని వివరించారు. ఎన్నికల అనంతరం మే 19న ఓట్ల లెక్కింపును నిర్వహిస్తామని తెలిపారు. కాగా, ఈ ఎన్నికల్లో గెలిచి తమ స్థానాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని, ప్రజలు తమ వెంటే నిలుస్తారని టీఆర్ఎస్ నమ్మకంతో చెబుతోంది.

  • Loading...

More Telugu News