: మహాలక్ష్మితో నాకు పోలికా?: రకుల్ ప్రీత్ సింగ్


'సరైనోడు' సినిమాలోని తన క్యారెక్టర్ మహాలక్ష్మితో తనకు అస్సలు పోలిక లేదని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. 'సరైనోడు' సినిమా ప్రమోషన్ లో ఆమె మాట్లాడుతూ, మహాలక్ష్మి అవసరం మేరకే మాట్లాడుతుందని చెప్పింది. రాజమండ్రి నుంచి వచ్చిన ఓ యువతి ఎలా ఉంటుందో సినిమాలో తాను అలా ఉంటానని వెల్లడించింది. ఈ సినిమాలో మహాలక్ష్మి పాత్రకు తన నిజజీవితానికి ఏమాత్రం సరిపోదని చెప్పింది. తాను లొడలొడా వాగుతానని, మహాలక్ష్మి పెద్దగా మాట్లాడదని పేర్కొంది. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాల్లో 'బ్రూస్ లీ', 'సరైనోడు' సినిమాల్లోనే ఎక్కువ డాన్స్ చేశానని చెప్పింది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమా నుంచి 'సరైనోడు' వరకు డాన్సుల్లో చాలా నేర్చుకున్నానని రకుల్ తెలిపింది.

  • Loading...

More Telugu News