: మంత్రి పదవినే వదులుకున్నా... టీడీపీలోకి వెళ్లేది లేదు: బాలినేని


తాను గతంలో మంత్రి పదవినే వదులుకుని జగన్ వెంట నడవాలని నిశ్చయించుకున్న వాడినని, అలాంటిది, ఇప్పుడు తుచ్ఛ రాజకీయాల్లో పావుగా మారి తెలుగుదేశం పార్టీలో ఎలా చేరుతానని వైకాపా నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. తాను వైకాపాను వీడనున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు. కొద్దిసేపటి క్రితం గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, తాను టీడీపీ నేతలెవరితోనూ మాట్లాడలేదని, ఇక ఆ పార్టీలోకి వస్తున్నట్టు ఎవరికి చెప్పానో వార్తలు రాసిన పత్రికలే వెల్లడించాలని అన్నారు. తమ మనోభావాలు దెబ్బతినేలా కథనాలు ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News