: '9/11'నే మరచిపోయిన డొనాల్డ్ ట్రంప్!


9/11... ఈ పదం వినగానే, అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ ట్విన్ టవర్స్, వాటిని విమానాలు ఢీకొట్టడం, వేలాది మంది మృతి చెందడం వంటి విషయాలన్నీ గుర్తుకు వస్తాయి. రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం '9/11'ను మరిచి ఆ స్థానంలో '7/11' అని మనసులో గట్టిగా గుర్తు పెట్టుకున్నట్టున్నారు. బుఫాలోలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పలుమార్లు 7/11 దాడులు అంటూ మాట్లాడుకుంటూ పోయారు. ఒకటి రెండు సార్లు కాదు... ఆయన ప్రసంగంలో ఎన్నోసార్లు ఈ పదాన్ని పలికారు. 7/11 నాడు తాను దాడి జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే ఉన్నానని, పోలీసులు, ఫైర్ మన్లు పడ్డ కష్టాన్ని చూశానని చెప్పారు. ఆయన మాట్లాడుతున్నంత సేపూ తప్పును సరిదిద్దాలని ఆయన టీం ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదట.

  • Loading...

More Telugu News