: ప్రత్యూష బెనర్జీ గర్భవతి!... ఆత్యహత్యకు ముందు అబార్షన్!
‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేం బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యోదంతంలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఆత్మహత్య చేసుకునే నాటికి ప్రత్యూష గర్భవతి అని, ఆత్మహత్యకు ముందు ఆమె అబార్షన్ చేయించుకుందని తేలింది. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆప్ ఇండియా’ నేటి తన సంచికలో సంచలన కథనాన్ని రాసింది. ముంబైలోని జేజే ఆసుపత్రి వైద్యులను ఉటంకిస్తూ ఆ పత్రిక ఈ కథనాన్ని రాసింది. ప్రత్యూష గర్భవతి అని, ఆమె అబార్షన్ చేయించుకున్న విషయాన్ని స్వయంగా జేజే ఆసుపత్రి వైద్యులే నిర్ధారించినట్లు కూడా ఆ పత్రిక రాసింది. ఇక సదరు గర్భానికి కారణమెవరన్న విషయాన్ని నిగ్గు తేల్చడం పోలీసులకు దాదాపుగా అసాధ్యమేనని కూడా ఆ కథనంలో పేర్కొంది.