: హైదరాబాద్ జూలో బోను నుంచి కలుగు తవ్వి తప్పించుకున్న ఎలుగుబంటి


హైదరాబాద్, బహదూర్ పురాలోని నెహ్రూ జూపార్క్ నుంచి ఓ ఎలుగుబంటి తప్పించుకుని జూ అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. తానుండాల్సిన బోను నుంచి బయటకు ఓ కలుగు తవ్వి మరీ తప్పించుకున్న ఈ ఎలుగు జూ ప్రహరీగోడ ఎక్కేసి హల్ చల్ చేసింది. ఎత్తయిన గోడ మీంచి దూకడానికి భయపడిందేమో, గోడపైనే అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయింది. ఎలుగుబంటిని చూసిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో, వారు హుటాహుటిన వచ్చి, దాన్ని పట్టుకునేందుకు కొన్ని గంటల పాటు శ్రమించారు. చివరికి ట్రాంక్విలైజర్ల ద్వారా మత్తు మందిచ్చి, దాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ క్లోజర్ నుంచి బయటకు వచ్చేందుకు గుంత తవ్వాలన్న ఆలోచన ఓ క్రూర జంతువుకు రావడం, జంతు ప్రదర్శన శాల చరిత్రలో అత్యంత అరుదు.

  • Loading...

More Telugu News