: మరోసారి మాట మార్చేశారు.. భారత్-పాక్ చర్చలు వాయిదా పడ్డాయి, రద్దు కాలేదంటున్న పాక్
భారత్- పాకిస్థాన్‌ల మధ్య చర్చలు రద్దు కాలేదని, వాయిదా మాత్రమే పడ్డాయని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారుడు సర్తాజ్ అజీజ్ ఓ టీవీ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. పాక్‌లో భారత్ దర్యాప్తు బృందం (నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ) పర్యటించే అవకాశాలను తమ ప్రభుత్వం పరిశీలిస్తుందని వ్యాఖ్యానించారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడి విషయమై పాక్‌లో భారత్ దర్యాప్తు బృందం పర్యటించాల్సి ఉంది. అయితే, ఇరు దేశాల మధ్య చర్చలు రద్దు చేస్తూ పాక్ నిర్ణయం తీసుకోవడంతో దర్యాప్తు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.